TG: నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో సగం కాలిన ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. అడవిలో దుర్వాసన రావడంతో గ్రామస్తులు దగ్గరగా వెళ్లి చూడగా ఈ దృశ్యం కనబడింది. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. మృతదేహం తీవ్రంగా కాలిపోవడంతో మహిళ ఎవరో గుర్తించడం సాధ్యంకాలేదని తెలిపారు. మహిళ హత్యకు గురైందా, లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.