TG: వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిపై ఒక బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలిక సంరక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని సంరక్షులు చెబుతున్నట్లు సమాచారం. పరిగి సర్కిల్లో వరుసగా విద్యార్థినులకు సంబంధించిన ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.