సౌత్ ముంబైలో నడిరోడ్డుపై ఒక పౌరుడు పోలీస్ అధికారిపై దాడి చేసిన భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సమీపంలో మరో ఇద్దరు పోలీసులు ఉన్నప్పటికీ సదరు వ్యక్తి అధికారిపైకి విరుచుకుపడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ సంఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.