ఎబోలా మృతులను సురక్షితంగా పూడ్చిపెట్టే బృందంపై దాడి

63చూసినవారు
ఎబోలా మృతులను సురక్షితంగా పూడ్చిపెట్టే బృందంపై దాడి
కాంగోలో ఎబోలా నియంత్రణ చర్యలకు అంతరాయం కలిగించే ఘటన చోటుచేసుకుంది. సౌత్ కీవు ప్రాంతంలో ఎబోలా మృతదేహాలను సురక్షితంగా ఖననం చేసే ప్రత్యేక బృందంపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది ఓ ఎబోలా బాధితుడి మృతదేహాన్ని అక్కడే వదిలి ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోయినట్లు సమాచారం. ఇదే సమయంలో చికిత్స పొందుతున్న 11 మంది ఎబోలా రోగులు కూడా పరారైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్