
బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 15న అర్ధరాత్రి సమయంలో బస్ స్టాండ్ నుండి బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. గస్తీ బృందం బాలికను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు, వారిపై పోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు.




