AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో మంత్ర, తంత్రాల కోసం యువకుడి మృతదేహాన్ని వెలికితీసిన దారుణ ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో బెంగళూరులో మృతి చెందిన దిలీప్ రావ్ (23) మృతదేహాన్ని అంత్యక్రియల తర్వాత శ్మశానంలో పూడ్చివేశారు. ఆదివారం సాయంత్రం గోవింద్ అనే వ్యక్తి, దిలీప్ మృతదేహాన్ని తవ్వేందుకు ప్రయత్నించగా స్థానికులు అతన్ని పట్టుకున్నారు. తన చిన్నాన్నతో మాట్లాడేందుకు మంత్ర తంత్రాలు చేసేందుకు మృతదేహాన్ని బయటకు తీసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.