పట్టపగలు మహిళను కిడ్నాప్‌ చేసేందుకు యత్నం (వీడియో)

31చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ రాయ్‌పూర్ ప్రాంతంలో 46 ఏళ్ల మహిళను అపహరించేందుకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. కుమార్తెను కాలేజీలో దింపి ద్విచక్రవాహనంపై వస్తుండగా, నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన ముసుగు ధరించిన దుండగులు ఆమెను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. బాధితురాలు కేకలు వేయడంతో స్పందించిన మహిళా పారిశుధ్య కార్మికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్