
విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న టీచర్ సస్పెండ్
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న సుజాత, ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఈ సంఘటనకు సంబంధించి సదరు టీచర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కుర్చీలో కూర్చుని విద్యార్థినులతో కాళ్లు పట్టించుకుంటున్న సుజాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.




