ప్రేమ పేరుతో వేధించి.. బాలికపై హత్యాయత్నం

12చూసినవారు
ప్రేమ పేరుతో వేధించి.. బాలికపై హత్యాయత్నం
TG: నల్లగొండ జిల్లా కేతేపల్లిలో ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికపై హత్యాయత్నం చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ప్రేమిస్తావా లేదా అంటూ బెదిరించాడు. బాలిక అరవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. బాలికకు స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్