
కుటుంబ కలహాలపై మంచు లక్ష్మి ఆగ్రహం: యూట్యూబ్ ఛానెళ్లకు శాపనార్థాలు
నటి మంచు లక్ష్మి తన వ్యక్తిగత జీవితం, కూతురి పెంపకం, సోషల్ మీడియా ప్రచారాలపై ఒక ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త 2019లో అమెరికా వెళ్లిపోయారని, కూతురిని అడవిలోనైనా బ్రతికేలా పెంచాలనుకుంటున్నానని తెలిపారు. తన తమ్ముడు విష్ణుతో తనకు గొడవలున్నట్లు యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అలాంటివారు సర్వనాశనం అయిపోవాలని మంచు లక్ష్మి తీవ్రంగా మండిపడ్డారు.




