AP: చిత్తూరు జిల్లాలో వెదురుకుప్పం మండలంలో దారుణ ఘటన జరిగింది. 6 వ తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి పాఠశాలలో దిగబెడతానని బైకుపై ఎక్కించుకొని మార్గ మధ్యంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పాఠశాల వద్ద బాలికను దిగబెట్టి వెళ్లి పోయాడు. బాలిక కుటుంసభ్యుల సమాచారం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.