తుపాకీతో బెదిరించి.. నగల దుకాణంలో దోపిడీకి యత్నం

35చూసినవారు
తుపాకీతో బెదిరించి.. నగల దుకాణంలో దోపిడీకి యత్నం
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నాగారం సత్యనారాయణ కాలనీలోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో ఓ దుండగుడు నకిలీ తుపాకీతో వ్యాపారిని బెదిరించి దోపిడీకి యత్నించాడు. యజమాని ప్రతిఘటించడంతో దుండగుడు తుపాకీ అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే కీసర సీఐ ఆంజనేయులు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు నకిలీ తుపాకీని స్వాధీనం చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్