ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం

50చూసినవారు
ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం
TG: వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వేల్పుల కమల్ అనే యువకుడు కిరాణా షాప్ నిర్వహిస్తుంటాడు. మంగళవారం రాత్రి కిరాణా దుకాణంలో సరుకులు కొనేందుకు బాలిక వెళ్లగా ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో దుకాణానికి వేరే వ్యక్తులు రావడంతో పాప బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి విషయం తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you