శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం.. పట్టుబడిన ఉద్యోగి

10288చూసినవారు
శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం.. పట్టుబడిన ఉద్యోగి
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నించిన బ్యాంకు ఉద్యోగి పట్టుబడ్డాడు. వంద గ్రాముల బంగారం బిస్కెట్‌ ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించారు. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్‌ను ఉంచాడు. నిందితుడిని విజిలెన్స్‌ సిబ్బంది అదుపులోకి తీసుకుని తిరుమల వన్‌ టౌన్‌ పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్