ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నెట్‌వర్క్ సమస్యలున్న చోట్ల ఆఫ్‌లైన్‌లోనూ హాజరు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంధులకు కంటి రెప్ప నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ-కేవైసీ పెండింగ్ ఉన్నా పని చేసే అవకాశం కల్పించింది. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకంలో భాగంగా ఈ మార్పులు చేశారు. సాంకేతిక సమస్యలకు అధికారులు చెక్ పెట్టారు.