
ప్రజలే పవన్‌ను తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది: ఎమ్మెల్సీ బల్మూరి
TG: కోనసీమకు దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైరయ్యారు. పవన్‌కు తెలంగాణపై అక్కసు ఉంటే HYD వదిలి ఏపీలోనే ఉండాలని సూచించారు. టీజీపై ఎంత వివక్ష ఉందో ఇప్పుడు బయటపడిందన్నారు. ఎర్ర జెండా నుంచి కాషాయం జెండాకు మారినట్టు, ఆయన వైఖరి మార్చారని ఎద్దేవా చేశారు. ఆ వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు ఇక్కడ ఆడవని, ఆదరించిన ప్రజలే ఆయన్ను తరిమికొట్టే పరిస్థితి ఉంటుందన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.




