కర్రతో కోడలి దాడి.. అత్త మృతి (వీడియో)
AP: అత్తాకోడళ్ల మధ్య జరిగిన వివాదంలో అత్త మృతి చెందారు. ఈ ఘటన చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. అత్త పసలమ్మపై కోడలు నాగమణి కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పసలమ్మను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
