ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టీ20లో భారత్ శుభారంభం చేసింది. రెండు ఓవర్లు ముగిసే సరికి స్కోరు 19/0గా ఉంది. బార్ట్‌లెట్ వేసిన రెండో ఓవర్‌లో తొలి నాలుగు బంతులకు మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. ఐదో బంతిని శుభ్‌మన్ గిల్ బౌండరీగా మలిచాడు. ప్రస్తుతం గిల్ 10, అభిషేక్ శర్మ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ వికెట్ నష్టం లేకుండా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు.