అధిక జ్యేష్ఠ మాసం ముగియనున్న నేపథ్యంలో వివాహాలు, ఇతర శుభకార్యాలకు మళ్లీ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. పండితుల సూచనల ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు పెళ్లిళ్లకు అనుకూలమైన శుభ ముహూర్తాలు ఉన్నాయి. జులై నెలలో 1, 2, 6, 7, 8, 11 తేదీలు వివాహాది శుభకార్యాలకు శ్రేయస్కరంగా పేర్కొంటున్నారు. అలాగే ఆగస్టులో 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీల్లో కూడా శుభ ముహూర్తాలు ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. దీంతో వివాహాలు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకోవచ్చని చెప్తున్నారు.