శ్రావణ మాసం శుభ ముహూర్తాలు.. నేటి నుంచే పెళ్లి బాజాలు

13653చూసినవారు
శ్రావణ మాసం శుభ ముహూర్తాలు.. నేటి నుంచే పెళ్లి బాజాలు
తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం శుభకార్యాల సందడి మొదలైంది. ఆషాఢ మాసం ముగిసి శ్రావణం ప్రారంభం కావడంతో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఆగస్టు 16 నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఆగస్టులో 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీలతో పాటు సెప్టెంబర్‌లో 3, 5, 8, 10 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నట్లు పంచాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముందస్తు బుకింగ్స్ చేసుకున్నారు. పెళ్లిళ్లతో ఫొటోగ్రాఫర్లు, క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలతో పాటు వస్త్ర, బంగారు ఆభరణాల వ్యాపారాల్లోనూ సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్