భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించగా.. 131 పరుగుల లక్ష్యాన్ని 21.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (46*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫిలిప్పే (37) ఆకట్టుకున్నాడు. భారత్ బౌలర్లలో అర్షదీప్, అక్షర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.