ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు అమలు చేసింది. ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించిన ఆన్‌లైన్ సేఫ్టీ ఎమెండ్మెంట్ బిల్–2024 నేటి నుంచే అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు సృష్టించుకోవడం లేదా వినియోగించడం నిషేధం. 16 నుండి 18 ఏళ్ల మధ్యవారికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. యువతను ఆన్‌లైన్ మోసాలు, సైబర్ బులీయింగ్, మానసిక ఒత్తిడిల నుంచి రక్షించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని ప్రభుత్వం తెలిపింది.