అణుయుద్ధం వస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సురక్షితం!

9079చూసినవారు
అణుయుద్ధం వస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సురక్షితం!
ప్రపంచ దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు మాత్రమే క్షేమంగా బయటపడే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తల విశ్లేషణలో తేలింది. 'రిస్క్ అనాలిసిస్' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఉత్తర అర్ధగోళంలో అణు లక్ష్యాలు ఎక్కువగా ఉండటం, ఈ దేశాలు దక్షిణ అర్ధగోళంలో ప్రధాన భూభాగాలకు దూరంగా ఉండటం, సముద్రంతో చుట్టుముట్టి ఉండటం వల్ల 'న్యూక్లియర్ వింటర్' ప్రభావాన్ని తట్టుకోగలవని తేలింది. ఈ దేశాలు తమ జనాభా కంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి, సమృద్ధిగా ఇంధన వనరులు, ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆరోగ్య, రక్షణ వ్యవస్థలు కలిగి ఉన్నాయి.

సంబంధిత పోస్ట్