
ట్రైసైకిల్‌ను తప్పించబోయి డంపర్‌ను ఢీకొట్టిన టెంపో.. ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా మొరాదాబాద్-ఆగ్రా హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దివ్యాంగుడి ట్రైసైకిల్‌ను తప్పించబోయి ప్రయాణికుల టెంపో, డంపర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, టెంపో డ్రైవర్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో టెంపో నుజ్జునుజ్జయ్యింది. పరారైన డంపర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.




