'పది' గణితం ప్రశ్నలపై ఆధికారులు ఆరా!

0చూసినవారు
'పది' గణితం ప్రశ్నలపై ఆధికారులు ఆరా!
TG: ఈ నెల 28న జరిగిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశ్నపత్రంలోని కొన్ని ప్రశ్నలు, ఒక ప్రైవేటు పాఠశాల ప్రాక్టీస్ పేపర్‌లోని ప్రశ్నలతో పోలి ఉండటం కలకలం రేపింది. ఆ పాఠశాల ఇచ్చిన 25 ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలు యథాతథంగా, మరో నాలుగు ప్రశ్నలు అదే మోడల్లో ఉండటంతో ఎస్ఎస్సీ బోర్డు అధికారులు విచారణ చేపట్టారు. ప్రశ్నపత్రం రూపొందించిన నిపుణులకు ఆ పాఠశాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన సృష్టిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్