రోడ్డుపై దొరికిన రూ.5.64 లక్షలను పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్

17చూసినవారు
రోడ్డుపై దొరికిన రూ.5.64 లక్షలను పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్
రోడ్డుపై దొరికిన డబ్బును పోలీసులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుప్పూర్‌కు చెందిన డ్రైవర్ మదన్ శనివారం ఉదయం ఆటోలో వెళ్తుండగా వలం వంతెన వద్ద ఓ బ్యాగు కనిపించింది. దానిని తెరిచి చూడగా అందులో రూ.5.64 లక్షల నగదు ఉండటాన్ని గమనించి వెంటనే తిరుప్పూర్ వెస్ట్ PSలో అప్పగించారు. విచారణలో ఆ డబ్బు హార్డ్ వేర్ దుకాణదారుడు ధనరామిదిగా గుర్తించి పోలీసులు అతనికి అందజేశారు. మదన్ నిజాయతీని అభినందిస్తూ పోలీసులు ఆయనను సత్కరించారు.

సంబంధిత పోస్ట్