ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


మహిళల వేధింపులపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కీలక ప్రకటన
Sep 29, 2026, 17:09 IST/

మహిళల వేధింపులపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కీలక ప్రకటన

Sep 29, 2026, 17:09 IST
ఒక నంబర్‌ను బ్లాక్ చేసినా.. మరో నంబర్ నుంచి పదేపదే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పంపడం కూడా వేధింపుల కిందకే వస్తుందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. తిరుపతిలో స్టాకింగ్ నివారణ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. సైబర్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళా హెల్ప్‌లైన్ 181, అత్యవసర పోలీసు సహాయం కోసం 112, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్లను సేవ్ చేసుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.