పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో: ముగ్గురి మృతి

121చూసినవారు
పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో: ముగ్గురి మృతి
AP: బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి వద్ద ఆటో పంటకాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి ఈ ప్రమాదానికి గురైంది. మృతులను చాట్రగడ్డ కాంతారావు, పెసర్లంక శ్రీనివాసరావు, షేక్‌ ఇస్మాయిల్‌గా గుర్తించారు. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్