బిగ్ బాస్ సీజన్-8 నుంచి అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. టాప్-5 కంటెస్టెంట్‌లలో ఉన్న అయన ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. 'వైల్డ్ కార్డ్' ద్వారా ఈ సీజన్ మధ్యలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాశ్, తన కామెడీతో అభిమానులను అలరించారు. ఫినాలే గెస్టుల్లో ఒకరైన కన్నడ నటుడు ఉపేంద్ర హౌస్‌లోకి వెళ్లి ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. కాగా, అవినాష్ గతంలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.