కరివేపాకుతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు, ఎముకల ఆరోగ్యానికి, కీళ్ల నొప్పులు, షుగర్ ఉన్నవారికి మేలు చేస్తుంది. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి బీపీ కంట్రోల్ అవుతుంది.