రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 10 లక్షల పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను సంప్రదించి యువతలో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత దేశం లక్ష్యంగా యువతలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.