దీపావళి పండుగ సందర్భంగా అయోధ్య సరయూ నదీ తీరాన 26 లక్షల 17 వేల దీపాలను వెలిగించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఒకేసారి 2,128 మంది భక్తులు హారతులు నిర్వహించడం మరో రికార్డుగా నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హారతి నిర్వహించి, రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రామ్‌లీలా ప్రదర్శనలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో ఈ దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.