అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. నగదు లెక్కింపు సమయంలోనే ఈ చోరీ జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు నియమించిన సిట్, దాదాపు 70,000 పేజీల ఛార్జిషీట్‌ను అయోధ్యలోని అదనపు జిల్లా జడ్జి (అవినీతి నిరోధక) కోర్టులో దాఖలు చేసింది. దేవుడి సొమ్మును కాజేయడం, దాచిపెట్టడం, పంచుకోవడంలో కొందరు వ్యక్తుల నెట్‌వర్క్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 8 మంది నిందితుల పేర్లను ఛార్జిషీట్‌లో చేర్చారు. వీరిలో ఏడుగురి నుంచి రూ.79.85 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అక్టోబర్ 7న కోర్టు ఎదుట హాజరుకానున్నారు.