
17 కిలోమీటర్లు నడిచి ఓటు హక్కు వినియోగించుకున్న గ్రామస్తులు (వీడియో)
తెలంగాణ , ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామస్తులు, 17 కిలోమీటర్లు నడిచి ఓటు వేశారు. గుట్టలు దిగి, వాగులు దాటి తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. తమ ఓటు విలువను చాటుకున్నారు.




