ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఖమేనీ హత్య: అమెరికా-ఇజ్రాయెల్ నిఘా వర్గాల ఏళ్ల తరబడి ప్రణాళిక
Mar 04, 2026, 02:03 IST/

ఖమేనీ హత్య: అమెరికా-ఇజ్రాయెల్ నిఘా వర్గాల ఏళ్ల తరబడి ప్రణాళిక

Mar 04, 2026, 02:03 IST
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీని హతమార్చేందుకు అమెరికా-ఇజ్రాయెల్ నిఘా వర్గాలు (సీఐఏ, మొస్సాద్) ఏళ్ల తరబడి ప్రణాళిక రచింటినట్లు తెలుస్తోంది. దంత ట్రాకింగ్ పరికరాలు, ట్రాఫిక్ కెమెరాలు, యాప్‌లను హ్యాక్ చేయడం వంటి పద్ధతులను ఉపయోగించారని సమాచారం. ఇజ్రాయెల్ డాక్టర్లు, దంత వైద్యులు ఇరాన్‌లో మోహరించి, మిలిటరీ అధికారులకు చికిత్స సమయంలో రహస్యంగా చిప్‌లను అమర్చారని, గ్యాస్ట్రో డాక్టర్ల ద్వారా కూడా ఇలాంటి పరికరాలను అమర్చినట్లు సమాచారం. ఈ నిఘా కారణంగానే ఖమేనీ ఆచూకీని కచ్చితంగా కనుగొన్నట్లు అంతర్ధాతీయంగా చర్చ నడుస్తోంది. మొస్సాద్, సీఐఏ వర్గాలు ఖమేనీ కార్యాలయానికి వచ్చే సమయాన్ని, ఆయనతో పాటు ఉండేవారిని ముందే పసిగట్టినట్లు రాయిటర్స్ కథనం వివరిస్తోంది.