TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఇరుముడి కట్టి శబరిమలకు బయలుదేరిన భక్తులు.. విమానం ఆలస్యం కావడం, సరైన సమాచారం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో గురువారం ఎయిర్‌పోర్టులో నిరసన తెలిపారు. ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేయాలని భక్తులు డిమాండ్ చేశారు.