TG: కాంగ్రెస్ సీనియర్ నేత అజహరుద్దీన్ శుక్రవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆయనకు హోం, మైనారిటీ సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటివరకు హోంశాఖ సీఎం రేవంత్ వద్దే ఉంది. ఇక మరో రెండు మంత్రి పదవులను బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అజారుద్దీన్‌ను రేవంత్ సర్కార్ ఎమ్మెల్సీగా ప్రతిపాదించి మంత్రి పదవి కట్టబెట్టింది.