మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్‌

0చూసినవారు
మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్‌
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ శుక్రవారం ప్రమాణం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్‌భవన్ లోని దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్