AP: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన యువకుడి పడి మృతి చెందాడు. ఆదివారం ఆరుగురు యువకులు కలిసి ఈ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. కొందరు ఈతకు దిగగా.. బీటెక్ చదువుతున్న నితిన్ రిజర్వాయర్‌లో జారిపడి మృతి చెందాడు. సోమవారం మృతదేహాన్ని గుర్తించి కేజీహెచ్‌కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.