బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి

45చూసినవారు
బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
TG: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న మహేందర్‌రెడ్డి (24) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మహేందర్‌రెడ్డి సూర్యాపేట వాసి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్