‘
బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ చిత్రం విడుదలై తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. 2017 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టిస్తూ రూ.1,800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని అభిమానులు సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.