
మెస్సీతో ఫోటోకు లక్షల్లో టికెట్.. ఉప్పల్ స్టేడియంకు ఫుట్బాల్ దిగ్గజం
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈ నెల 13న ఉప్పల్ స్టేడియానికి రానున్నారు. ఆయనతో ఫోటో దిగేందుకు వంద మందికి అవకాశం లభించనుంది. ఫలక్ నుమా ప్యాలెస్ లో మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫోటో తీయించుకోవడానికి టికెట్ ధర రూ. 10 లక్షలుగా నిర్ణయించారు.




