
డిజిటల్ అరెస్టుల మోసాలపై సుప్రీంకోర్టు ఆందోళన
సైబర్ నేరగాళ్లు 'డిజిటల్ అరెస్టు' పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని, ఈ మోసాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హరియాణాకు చెందిన ఓ మహిళకు సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో నకిలీ పత్రాలు చూపించి, కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఘటనపై సుమోటోగా కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం, కేంద్రం, సీబీఐలకు స్పందన తెలపాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి నేరాలపై కేంద్ర, రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం అవసరమని ధర్మాసనం పేర్కొంది.




