'బాహుబలి: ది ఎపిక్‌' ప్రీమియర్.. రాజమౌళి సందడి (వీడియో)

30514చూసినవారు
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో 'బాహుబలి ది ఎపిక్' ప్రీమియర్ షో సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి విడుదలై పదేళ్లు గడిచినా క్రేజ్ తగ్గలేదని, ఇది అభిమానుల ప్రేమ వల్లే సాధ్యమైందని అన్నారు. మహిష్మతి రాజ్యంలోని ప్రజలంతా బాగున్నారా? అంటూ అభిమానులను పలకరించారు. వారి ప్రేమ వల్లే మరోసారి బాహుబలిని మీ ముందుకు తీసుకొస్తున్నామని, పదేళ్లుగా ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 'జై మహిష్మతి' అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

సంబంధిత పోస్ట్