గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ప్రదర్శన అతని ప్రపంచకప్ జట్టులో స్థానంపై ఉన్న సందేహాలను తొలగించి, ఆశలను సజీవంగా ఉంచింది. అయితే ఈ హాఫ్ సెంచరీలు టీ20 ఫార్మాట్‌కు అవసరమైన వేగంతో చేయలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా సిడ్నీ సిక్సర్స్ జట్టు రెనెగేడ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.