ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత మృతి (వీడియో)

5చూసినవారు
TG: వనపర్తి జిల్లా ప్రజా వైద్యశాలలో మంగళవారం నాడు నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన కొత్తకోట మండలం అపరాలకు చెందిన భవ్య(24) అనే మహిళ, వైద్యుల నిర్లక్ష్యానికి గురై మృతి చెందింది. బ్లీడింగ్ అవుతుండగానే జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసిన వైద్యులు.. అక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భవ్య నిన్న సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనతో ఆగ్రహించిన భవ్య కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యులైన వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.