మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చనిపోయిందని భావించిన నవజాత శిశువు ఖననం ముందు మళ్లీ కదలింది. ప్రసవం అనంతరం శిశువు మృతిచెందిందని వైద్యులు చెప్పారు. 12 గంటల తర్వాత అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో శిశువు కదలడం గమనించడంతో బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు స్థితి నిలకడగా ఉంది. తల్లి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించింది. ఘటనపై కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.