తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న భారీ శిశు విక్రయ ముఠాను గుజరాత్ పోలీసులు 'ఆపరేషన్ దేవ్'లో భాగంగా రట్టు చేశారు. నవజాత శిశువులు, చిన్న పిల్లలను అపహరించి అక్రమంగా విక్రయిస్తున్న మురుగన్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఏడాదిలో 25 మంది చిన్నారులను విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. మురుగన్ భార్య కృష్ణవేణి కూడా మరో గ్యాంగ్‌ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. లోతైన దర్యాప్తు కోసం హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.