ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. 1వ తేదీన జీతాలు రావు!

90చూసినవారు
ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. 1వ తేదీన జీతాలు రావు!
మే 1వ తేదీన కార్మిక దినోత్సవం, బుద్ధ పౌర్ణమి రావడంతో ఆ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి. దీంతో ఉద్యోగుల జీతాల జమలో స్వల్ప ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఆ రోజున NEFT, RTGS వంటి బ్యాంకింగ్ క్లియరింగ్ సేవలు పూర్తిగా పనిచేయకపోవడంతో జీతాల ప్రాసెసింగ్ ఆగిపోతుంది. అందువల్ల సాధారణంగా మే 1న రావాల్సిన జీతాలు మే 2 లేదా తదుపరి పనిదినంలో ఖాతాల్లో జమ కావచ్చు. అయితే కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుగానే జీతాలు విడుదల చేసే అవకాశమున్నా, ఎక్కువ కంపెనీలు బ్యాంకింగ్ షెడ్యూల్‌ను అనుసరిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్