తెలంగాణలోని పలు జిల్లాలను వరదలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో భారీ విధ్వంసమే జరిగింది. పలు ఇండ్లు, కాలనీలు నీట మునిగాయి. భారీ ఆస్తినష్టం పంటనష్టం జరిగింది. పలువురు చనిపోయారు. దాంతో వరద బాధితులకు టాలీవుడ్ నుంచి ఒక్కొక్కరుగా సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి మనసు చాటుకున్నాడు. తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందించారు.